Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్‌కు సెక్షన్ 91 సీఆర్పీసీ కింద సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్‌లోని సంజయ్ నివాసానికి సిట్ పోలీసులు మంగళవారం వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవటంతో ఇంటి గోడకు నోటీసులు అతికించారు.
ఈ తరుణంలో బండి సంజయ్ స్పందిస్తూ సిట్‌కు లేఖ రాశారు. దీనిలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ ఎదుట ఇవాళ తాను హాజరుకాలేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. సిట్ కార్యాలయం నుంచి తనకు ఎలాంటి నోటీసు రాలేదని ఆ లేఖలో తెలిపాడు. ఇవాళ సిట్ ఎదుట హాజరుకావాల్సిందిగా వార్తా కథనాల ద్వారా తనకు తెలిసిందన్నారు. నోటీసులోని విషయాలను తాను చూడలేదని, ఎంపీగా పార్లమెంట్‌కు హాజరుకావాల్సిన బాధ్యత తనకుందని సమావేశాల దృష్ట్యా ఇవాళ సిట్ విచారణకు తాను రాలేనని స్పష్టం చేశారు. హాజరుకు మరో తేదీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.