Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మంచు ఫ్యామిలీలో విభేదాలంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్, విష్ణుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందంటూ గుసగుసలు వినిపించాయి. ఈ తరుణంలో ఓ సంచలన వీడియో బయటకు వచ్చింది. తన అన్నతో విభేదాలు ఉన్నాయంటూ స్వయంగా మంచు మనోజ్ బయటపెట్టాడు.
విష్ణు ఇంట్లోకి చొరబడి తన అనుచరులపై దాడి చేశాడంటూ తాజాగా మనోజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టంట సంచలనం రేపుతోంది. విష్ణు ఇంట్లోకి చోరబడి మనోజ్ సన్నిహితుడైన అయిన సారథితో వివాదానికి దిగడమే కాదు అతడిపై దాడి చేశాడంటూ.. ఇదీ పరిస్థితి కొంతకాలంగా మా అన్న విష్ణు వ్యవహరం ఇలా ఉంది అంటూ మనోజ్ తెలిపాడు. ఈ వీడియోను మంచు మనోజ్ ఫేస్బుక్, ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన కాసేపటికే డిలీట్ చేశారు.