Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పంజాబ్
ఫిరోజ్పూర్ లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టీచర్లు మృతిచెందగా, మరో 11 మంది టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జలాలాబాద్ నుంచి 14 మంది టీచర్లు ఓ జీపు ఎక్కారు. వివిధ స్కూళ్లలో పనిచేసే ఆ టీచర్లు ప్రతి రోజూ జీపులో వెళ్తుంటారు. ఖాయి ఫెమి కే గ్రామం సమీపంలో టీచర్లు ప్రయాణిస్తున్న జీపు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో జీపు డ్రైవర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదే క్రమంలో ముగ్గురు టీచర్లు మృతి చెందారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడం వల్ల జీపు విండోలను బ్రేక్ చేసి మరీ మృతదేహాలను వెలికితీశారు. ఓవర్లోడ్ అయిన జీపు ట్రక్కును ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.