Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ యాక్టర్లు ప్రియదర్శి , కావ్యా కల్యాణ్‌రామ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'బలగం'. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటించారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 3న థియేటర్లలో విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బంధుత్వాలు, సమస్యల మూలాల చుట్టూ తిరిగే కథాంశంతో సాగుతూ బలగం అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా బలగం ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చింది. బలగం అమెజాన్ ప్రైం వీడియోలో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నేటి (మార్చి 24) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన బలగం డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది చూడాలి మరి. తెలంగాణలోని పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో సాగే కథాంశంతో తెరకెక్కిన బలగం చిత్రాన్నిశిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలిచింది. బలగం పాటలను మ్యూజిక్, మూవీ లవర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.