Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
విద్యుత్ ఉద్యోగులు ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధా వద్ద మహాధర్నా చేపట్టారు. వేతన సవరణ, ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు వివిధ జిల్లాల నుంచి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. ఈ తరుణంలో విద్యుత్ సౌధా పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఖైరతాబాద్-పంజాగుట్ట రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.