Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ, ఈడీ వంటి సంస్థలను మోడీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న విపక్షాలు తాజాగా మూకుమ్మడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల వివక్షపూరిత వినియోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీలు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి.
ఈ పిటిషన్ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 5న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. కాంగ్రెస్ సహా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతా దళ్ యునైటెడ్, భారత్ రాష్ట్ర సమితి, రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్వాదీ పార్టీ, శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, డీఎంకే పార్టీలు సంయుక్తంగా ఈ పిటిషన్ దాఖలు చేశాయి.