Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతూ ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తండ్రి పీ.సుబ్రహ్మణ్యం (85) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. సుబ్రహ్మణ్యం మరణం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అజిత్ కుమార్ తండ్రి పీ. సుబ్రహ్మణ్యం మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని, అజిత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని స్టాలిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
శరత్‌కుమార్, ఖుష్బూ, పళనిస్వామి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సుబ్రహ్మణ్యం మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం చోటుచేసుకోవడంతో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నటుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, సుబ్రహ్మణ్యం వృద్దాప్య కారణాల రీత్యా అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. నేడు చెన్నైలోని బెసంత్ నాగ శ్మశాన వాటికలో సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.సుబ్రహ్మణ్యం స్వస్థలం కేరళలోని పాలక్కాడ్. ఆయన కోల్‌కతాకు చెందిన మోహినీ (సింధి ఫ్యామిలీ)ని పెళ్లి చేసుకున్నారు. సుబ్రహ్మణ్యంకు ముగ్గురు కుమారులు కాగా.. అజిత్‌కుమార్ రెండోకుమారుడు.