Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మంగళగిరి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వైకాపా తిరుగుబాటు నేత, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి శుక్రవారం తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ తరుణంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల్లో నిరంతరం ఉంటూ సమాజానికి సేవ చేయాలనే తపన ఉండే వ్యక్తి గిరిధర్‌రెడ్డి అని అన్నారు. వైకాపా సేవ దళ అధ్యక్షుడే రాజీనామా చేశాడంటే ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మరికొందరు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందర్నీ చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.