Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సీనియర్ నటుడు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు ఓ వీడియోతో స్పష్టమైంది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మంచు విష్ణు స్పందించారు. ఈ ఘటన నిన్న ఉదయం జరిగిందని, ఇదేమంత పెద్ద గొడవ కాదని స్పష్టం చేశారు. మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయం అని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. సారథి తనతో వాగ్వాదం పెట్టుకుంటే, మనోజ్ ఈ వాగ్వాదాన్ని ఆపలేకపోయాడని వివరించారు. మనోజ్ చిన్నవాడు కనుక ఏదో కోపంలో ఆ వీడియోను పోస్టు చేసి ఉంటాడని, దీన్ని పట్టించుకోనవసరం లేదని అభిప్రాయపడ్డారు.