Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సియోల్ : పెద్ద ఎత్తున రేడియోధార్మిక సునామీని సృష్టించి, నావికా దళాన్ని, నౌకాశ్రయాలను ధ్వంసం చేయగలిగే అణు సామర్థ్యంగల, నీటిలో ప్రయాణించే డ్రోన్‌ను పరీక్షించినట్లు ఉత్తర కొరియా శుక్రవారం తెలిపింది. దీనిని తీరం నుంచి కానీ, నౌకల ద్వారా కానీ మోహరించవచ్చునని తెలిపింది. ఈ వివరాలను ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. దక్షిణ కొరియాలోని కొన్ని లక్ష్యాలపై అణు దాడి నమూనాను ఉత్తర కొరియా బుధవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే అణు సామర్థ్యంగల, నీటిలో ప్రయాణించి, శత్రు నౌకలపై దాడి చేయగలిగే డ్రోన్‌ను పరీక్షించింది. బుధవారం క్రూయిజ్ మిసైల్ ప్రయోగాలు కూడా చేసింది. ఈ విన్యాసాలు, పరీక్షలను ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షించారు. అమెరికా-దక్షిణ కొరియా విన్యాసాలను కిమ్ తీవ్రంగా ఖండించారు. తమ దేశంపై దాడి చేసేందుకు ఈ విన్యాసాలు రిహార్సల్ అని మండిపడ్డారు. తమ శత్రువులను నిరాశలో కూరుకుపోయేలా చేస్తామని శపథం చేశారు.