Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మహిళల ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు కొట్టింది. మిడిలార్డర్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ (51) హాఫ్ సెంచరీతో చెలరేగింది. చివర్లో అమేలియా కేర్(29), పూజా వస్త్రాకర్ (11) ధాటిగా ఆడారు. అమేలియా బౌండరీలతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టించింది. ఓపెనర్ యస్తికా భాటియా(21), హేలీ మాథ్యూస్ (26) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. ఫామ్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్(14) విఫలమైంది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ రెండు వికెట్లు తీసింది. అంజలి సర్వానీ, పర్షవీ చోప్రాకు ఒక్కో వికెట్ దక్కింది.