Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, ఆయన అర్ధాంగి అనుష్క శర్మ సామాజిక సేవల కోసం ఓ స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు. ఈ సంస్థ పేరు సేవ (ఎస్ఈవీవీఏ). ఇందులో ఎస్ అంటే సేవ, వీ అంటే విరాట్, వీ అంటే వామిక, ఏ అంటే అనుష్క. వామిక.... కోహ్లీ, అనుష్క దంపతుల ముద్దుల తనయ అని తెలిసిందే. తమ పేర్లు కలిసొచ్చేలా కోహ్లీ దంపతులు తమ ఎన్జీవోకు నామకరణం చేశారు.
కాగా, కోహ్లీ, అనుష్క ఇప్పటికే విడివిడిగా సామాజిక సేవలు చేస్తున్నారు. అందుకోసం వారు తమ పేరిట విరాట్ కోహ్లీ ఫౌండేషన్, అనుష్క శర్మ ఫౌండేషన్ స్థాపించారు. ఇప్పుడు నూతన ఎన్జీవో సేవ ఆవిర్భావం నేపథ్యంలో రెండు ఫౌండేషన్లను విలీనం చేశారు. ప్రపంచం ఓ కుటుంబం వంటిదని, ఆ కుటుంబంలోనే తాము కూడా జీవిస్తున్నామని కోహ్లీ, అనుష్క తెలిపారు. ప్రపంచమనే కుటుంబానికి తమకు వీలైనంతగా సేవ చేస్తూనే ఉంటామని వివరించారు.