Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలోని అబిడ్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గుల కుంటలోని కామినేని హాస్పిటల్ పక్కనే ఉన్న కార్ గ్యారేజిలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో దాదాపుగా ఐదు కార్లు దగ్ధం అయ్యాయి. ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ సంతోష్ సజీవదహనం అయ్యాడు. ప్రమాద ఘటనకు పక్కనే హాస్పిటల్కి చెందిన పవర్ జనరేటర్స్ కి మంటలు తాకకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.