Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమల
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఏప్రిల్ 8న ప్రారంభించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వయా గుంటూరు మీదుగా ఈ రైలును నడపనున్నట్లు పేర్కొన్నారు. అంటే సికింద్రాబాద్ నుంచి బీబీనగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకోనుంది. అయితే ఈ రైలు ఏయే స్టేషన్లలో ఆగనుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయిల్ రన్ పూర్తయింది. ఈ రైలు ప్రారంభమైతే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రస్తుతం 12 గంటలుగా ప్రయాణ సమయం ఆరున్నర గంటల నుంచి 7 గంటలకు తగ్గనుంది.