Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బొగ్గుల కుంటలోని ఓ కారు మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 7 కార్లు దగ్ధం కాగా.. కారులో నిద్రిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని సెక్యూరిటీ గార్డుగా గుర్తించారు. ఈ ప్రమాదంతో బొగ్గులకుంట పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.