Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది. గత 146 రోజుల్లో ఒకే రోజు ఇంత పెద్దసంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,47,02,257కు చేరింది. కాగా, గత 24 గంటల్లో ఆరుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు 5,30,824 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా మృతిచెందినవారిలో మహారాష్ట్రలో ముగ్గురు ఉండగా, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం వరకు 910 మంది కోలుకున్నారు. మొత్తంగా 4,41,62,832 మంది మహమ్మారినుంచి బయటపడ్డారు. మరో 8601 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.33 శాతంగా ఉండగా, 0.02 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 98.79 శాతం మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220.65 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.