Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి మద్దతుగా మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు కాంగ్రెస్ ఎంపీలు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సైతం జైలుకు వెళ్లేందుకే సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఎంపీలు మూకమ్మడిగా రాజీనామా చేసే అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తోంది. త్వరలో సూరత్ లేదా ఢిల్లీలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించనున్నట్టు సమాచారం.
ఈ తరుణంలో రాహుల్‌పై అనర్హత వేటు ప్రతిపక్షాల ఐక్యతకు దారి తీయనుందా!? ఇందుకు ‘ఔను’ అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మహారాష్ట్రలో శరద్ పవార్, ఉద్ధవ్‌ఠాక్రే, ఢిల్లీలో కేజ్రీవాల్, తమిళనాడులో స్టాలిన్, బెంగాల్లో మమత నుంచి తెలంగాణలో కేసీఆర్ వరకూ విపక్షనేతలు స్పందించిన తీరును ఇందుకు ఉదహరిస్తున్నాయి. రాహుల్‌పై వేటుతో రాబోయే రోజుల్లో రాజకీయ పర్యవసానాలు తీవ్రంగా ఉండనున్నాయని విశ్లేషించాయి. దేశంలో రాజకీయం మోదీకి, ఇతర పార్టీలకు సంకుల సమరంగా మారిందని వాజపేయి మాజీ సలహాదారు సుధీంద్ర కులకర్ణి విశ్లేషించారు.