Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్లోని పంజాగుట్ట చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చే నెల 14న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు పనులను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి చాలా ఏండ్లుగా డిమాండ్ ఉన్నదని, దీనిపట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నామని స్పష్టం చేశారు.