Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీహార్ జైలులో ఉన్న ఆయన్ని ఈడీ విచారిస్తోంది. ఈ తరుణంలో సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో శనివారం విచారణ చేపట్టిన స్పెషల్ జడ్జ్ నాగ్పాల్ బెయిల్ పిటిషన్పై విచారణను ఏప్రిల్ 5కు వాయిదా వేశారు. సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఈడీ స్పందన తమకు అందలేదని సిసోడియా తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. బెయిల్ పిటిషన్ పై ఈడీ స్పందన తాము తెలుసుకోవాలనుకుంటున్నట్లు సిసోడియా తరపు న్యాయవాది ధ్యాన్ కృష్ణన్ కోర్టుకి తెలిపారు. ఇందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 5కు వాయిదా వేసింది.