Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో కొత్త మెట్రో లైన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. రూ.4,249 కోట్ల వ్యయంతో నిర్మించిన 13.71 కి.మీ మేరకు వైట్‌ఫీల్డ్ నుంచి కృష్ణరాజపురం మెట్రో లైన్‌ను 12 స్టేషన్లతో శుక్రవారం ప్రధాని ప్రారంభించారు. ఈ క్రమంలో మెట్రోలో ప్రయాణించి, బెంగళూరు మెట్రో రైలు సిబ్బంది, మెట్రో నిర్మాణ కార్మికులు, విద్యార్థులతో సహా వివిధ వర్గాల ప్రజలతో సంభాషించారు. ఆయన వెంట కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తదితరులు ఉన్నారు.
ఈ సెక్షన్ బైయప్పనహళ్లి నుంచి వైట్‌ఫీల్డ్ స్టేషన్ వరకు పనిచేసే తూర్పు-పశ్చిమ కారిడార్ కి తూర్పు పొడిగింపు అని అధికారులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న 15.81 కి.మీ పొడిగింపులో కేఆర్ పురం నుండి వైట్‌ఫీల్డ్ వరకు 13.71 కి.మీ సెక్షన్‌ను శనివారం ప్రారంభించారు. ఈ మార్గంలో ప్రయాణ సమయాన్ని 40 శాతం తగ్గించి, రహదారి ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. బీఈఎంఎల్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేయబడిన ఆరు కోచ్‌ల ఐదు రైళ్లను ఈ మార్గంలో నడుపుతామని, మరిన్ని రైళ్లను బ్యాకప్‌గా ఉంచుతామని అధికారులు తెలిపారు.