Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆదివారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. తుదిపోరులో ఢిల్లీతో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ , ముంబై ఇండియన్స్ రెండూ లీగ్ దశను 12 పాయింట్లతో సాధించాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో ఆది నుంచి నిలకడైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ముంబై ఇండియన్స్ కీలకమైన ఎలిమినేటర్ లో కూడా ఆల్ రౌండ్ షో తో దుమ్మురేపింది. సీజన్ ఆరంభం నుంచి చక్కటి ప్రదర్శనతో సత్తాచాటిన ముంబై శుక్రవారం జరిగిన ఎలిమినేటర్‌లో 72 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది.