Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
శుక్రవారం షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో పాక్‌స్థాన్ ని అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. టీ20 ఫార్మాట్లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్కిదే తొలి విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ అఫ్గాన్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగులకే పరిమితమైంది.
ఈ లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ లేకుండా బరిలోకి దిగిన పాక్ అఫ్గాన్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. అయితే కష్టాల్లో పడిన పాకిస్థాన్‌ను ఇమాద్ వసీమ్ (18) ఆదుకున్నాడు. లక్ష్యఛేదనలో 10 ఓవర్లకు 45/4 స్కోరుతో కష్టాల్లో ఉన్న అఫ్గానిస్థాన్‌ను మహమ్మద్ నబీ (38), నజీబుల్లా జద్రాన్ (17) నిలకడగా ఆడి గెలిపించారు.