Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటును ఖండిస్తూ గాంధీభవన్‌లో జీహెచ్ఎంసీ నాయకులతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటును ఖండిస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి, నిరసన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నగర నాయకులంతా నిరసనల్లో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఇదు తరుణంలో నేడు ఓయూలో నిరుద్యోగ యువత నిరసన ర్యాలీ చేపట్టింది. సేవ్ రాహుల్ గాంధీ, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు.