Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
అమెరికాలో మరోసారి టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మిస్సిస్సిపిలో భారీ గాలులు, ఉరుములు కురుసిన వానకు దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. ఈ తరుణంలో టోర్నడోలతో భారీ నష్టం జరిగిందని, 160 కిలోమీటర్ల పరిధిలో ప్రభావం చూపిందని అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది. వెస్ట్రన్ మిస్సిస్సిప్పిలోని సిల్వర్ సిటీని తుఫాను అనంతరం అధికారులు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.
సిల్వర్ సిటీలో దాదాపు 200 మంది నివాసం ఉంటున్నారు. పెనుగాలులు, వర్షం అనంతరం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో శుక్రవారం రాత్రంతా జనం కారుచీకట్లోనే కాలం గడిపారు. గాయపడ్డవారిని అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.