Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమారావతి
మంగళగిరిలోని నవులూరు వద్ద మధ్యాదాయ వర్గాల కోసం వేసిన జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లేఅవుట్లో ప్లాట్ల కొనుగోలు కోసం సీఆర్డీఏ మరోమారు ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఈ ప్లాట్లు కొనుగోలు చేయొచ్చని ప్రకటించింది. లేఅవుట్ వేసి రెండేళ్లు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అంతే కాకుండా జగనన్న లేఅవుట్లో ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం ప్లాట్లను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్లాట్లలో 20శాతం రాయితీ ఇవ్వనున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ ప్రకటనలో పేర్కొన్నారు. ప్లాట్లలో చదరపు గజానికి రూ.17,499గా ధర నిర్ధారించగా ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. 40శాతం అభివృద్ధి ధరపై రిజిస్ట్రేషన్ ఛార్జీలూ మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.