Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం (ఆర్సీ15) శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. తాజాగా హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీలపై ఓ బ్యూటిఫుల్ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ పాట షూటింగ్ నేటితో ముగిసింది.
ఇక, ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో సెట్స్ లో సందడి వాతావరణం నెలకొంది. యూనిట్ సభ్యుల మధ్య రామ్ చరణ్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ స్పెషల్ కేక్ పై గులాబీ రేకులతో అందంగా ముస్తాబు చేయడం విశేషం. రామ్ చరణ్ నడిచి వస్తుండగా గులాబీ రేకుల వర్షం కురిపించారు. దర్శకుడు శంకర్, రామ్ చరణ్, కియారా అద్వానీలతో పాటు ఈ వేడుకలో నిర్మాత దిల్ రాజు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా పాల్గొన్నారు. రామ్ చరణ్ కు చిత్రయూనిట్ సభ్యులంతా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.