Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ -2023 విజేతగా తెలుగు వారియర్స్ నిలిచింది. విశాఖ వేదికగా భోజ్పురి దబాంగ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి టైటిల్ను కైవసంచేసుకుంది. కెప్టెన్ అఖిల్ అక్కినేని అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మొత్తం సీసీఎల్ చరిత్రలో అత్యధికంగా నాలుగు టైటిల్స్ గెలిచిన జట్టుగా తెలుగు వారియర్స్ చరిత్ర సృష్టించింది.
ఫైనల్ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన భోజ్పురి తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన వారియర్స్ తొలి ఇన్నింగ్స్లో అఖిల్ (67) రాణించడంతో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో భాగంగా బ్యాటింగ్కు దిగిన భోజ్పురి 6 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. 58 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్కు దిగిన తెలుగు వారియర్స్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించడమే కాకుండా సీసీఎల్ టోర్నీలో నాలుగో టైటిల్ను కైవసం చేసుకుంది.