Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఆదివారం జరిపే సిట్ విచారణలో బండి సంజయ్ హాజరుకావాల్సి ఉంది. అయితే బండి సంజయ్ బదులుగా తరుఫున బీజేపీ లీగల్ టీమ్ సిట్ ముందుకు హాజరవుతుందని తెలుస్తోంది.
ఈ కేసు సంబంధించిన ఆధారాలతో ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ బండి సంజయ్‌కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు తనకు బదులుగా బీజేపీ లీగల్ టీమ్‌ను పంపాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నారు. రేపు బీదర్‌లో నిర్వహించే అమిత్ షా సభకు సంజయ్ హాజరుకానున్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. ఇటు తెలంగాణ నుంచి బండి సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలకు వెళ్తున్నారు. సిట్ విచారణకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. బండి సంజయ్ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తీసుకుని ఈ నెల 24న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే తాను ఇంట్లో లేకపోవటంతో ఇంటికి నోటీసులు అంటించారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని బండి సంజయ్ చెప్పటంతో ఆయన మరోసారి నోటీసులు ఇచ్చారు.