Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పట్నా
లైంగికదాడి ఆరోపణలతో 20 రోజుల క్రితం జైలుకెళ్లిన ఓ యువకుడు. అదే బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు నాలుగు గంటల పాటు పెరోల్‌పై విడుదయ్యాడు. బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి పేరు రాహుల్ కుమార్. హాజీపుర్‌లో ఇంజినీరింగ్ చదివాడు. బాధిత యువతి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి.
వీరిద్దరూ మంచి స్నేహితులు. వీరి స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 4న వీరు గోపాల్‌గంజ్‌లోని ఓ గుడికి వెళ్లారు. ఆరోజు రాత్రి రాహుల్ కుమార్ స్నేహితుని ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి జరిగిన ఘటనతో యువతి ఆరోగ్యం క్షీణించింది. అయితే ఈ తరుణంలో యువతి లైంగికదాడికి గురైనట్లు వైద్యులు అభిప్రాయపడ్డారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రాహుల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తాను లైంగికదాడి చేయలేదనీ, ఇద్దరం ప్రేమించుకున్నామని కోర్టులో తెలిపిన నిందితుడు ఆమెను వివాహం చేసుకునేందుకు అనుమతి కోరాడు. పెరోల్‌పై వచ్చి పెళ్లి చేసుకున్నాడు.