Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
మహాత్మా గాంధీకి కనీసం ఒక్క యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదని జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలకు గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ స్పందించారు. ఆయన విమర్శ పనికిమాలినదిగా కొట్టివేశారు.
ఈ తరుణంలో గాంధీ రెండు మెట్రిక్ పరీక్షలు పాసయ్యారని, ఒకటి రాజ్‌కోట్‌లోని ఆల్ఫ్రెడ్ హైస్కూల్, రెండోది మెట్రిక్కు సమానమైన బ్రిటిష్ మెట్రిక్య్లేషన్ పరీక్షను లండన్‌లో చదివారని తెలిపారు. లండన్ యూనివర్సిటీ అనుబంధ ఇన్నర్ టెంపుల్ లా కాలేజీలో లా డిగ్రీ ఉత్తీర్ణత సాధించారని, లాటిన్, ఫ్రెంచ్ భాషల్లో డిప్లొమాలు కూడా పొందారన్నారు. అయితే మొత్తం న్యాయశాస్త్రంలో గాంధీ డిగ్రీ పొందలేదన్న విషయాన్ని తాను అంగీకరిస్తానన్నారు. ఈ విషయంపై స్పష్టత కోసం జమ్ముకశ్మీర్ ఎల్జీకి బాపు బయోగ్రఫీ పుస్తకాన్ని పంపుతున్నానని, అది చదివైనా తన అవగాహనను పెంచుకుంటారని ఆశిస్తున్నట్టు తుషార్ తెలిపారు.