Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమవ్వగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది. G20 సదస్సుల్లో భాగంగా విశాఖలో మారథాన్, సాహసక్రీడలు జరుగుతున్నాయి.
ఆదివారం కావడంతో ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా G20 మారథాన్ ప్రారంభం అయింది. మారథాన్ ప్రారంభించారు మంత్రులు ఆదిమూలపు సురేష్, విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్. ఉదయం మారథాన్ ప్రారంభించిన సురేష్ నిర్వాహకులు ఆహ్వానం మేరకు పారా మోటారింగ్ రైడ్ కు బయలు దేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడదల రజనీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కుదుపులకు గురైంది.