Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాషింగ్టన్
అమెరికాలోని వాషింగ్టన్లో భారత్‌కు చెందిన జర్నలిస్ట్‌పై ఖలిస్థాన్ మద్దతుదారులు భౌతిక దాడికి పాల్పడ్డారు. అతనిపై దుర్భాషలాడారు. ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌కు మద్దతుగా కొందరు వ్యక్తులు వాషింగ్టన్లో ఉన్న ఇండియన్ ఎంబసీ వద్ద నిరసన వ్యక్తంచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న భారత జర్నలిస్ట్ లలిత్ కే ఝా ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లారు.
ఈ తరుణంలో లలిత్‌పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడికిదిగారు. కర్రతో అతని చెవి కింద కొట్టారు. అక్కడితో ఆగకుండా అతనిపై దుర్భాశలాడారు. అయితే అక్కడే ఉన్న అమెరికా సీక్రెట్ సర్వీస్‌కు చెందిన సిబ్బంది అతడిని రక్షించారు. తన విధిని నిర్వహించేందుకు సహాయపడిన సీక్రెట్ సర్వీస్ వారికి ధన్యవాదాలు. వారు కాపాడకపోయి ఉంటే నేను ఈ విషయాన్ని హాస్పిటల్లో ఉండి రాయాల్సి వచ్చేది. ఖలిస్థాన్ మద్దతుదారుల్లోని ఓ వ్యక్తి తనను ఎడమ చెవిపై రెండు కర్రలతో కొట్టాడని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.