Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుంటూరు
తాడేపల్లిలో దౌర్జన్యం ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వ్యక్తిపై దాడి జరిగింది. ఓ వాహనదారుడు పెట్రోల్ పోయించుకున్నాడు. ఫోన్ పే పని చేయకపోవడంతో నగదు ఇవ్వాలని బంక్ సిబ్బంది అడగారు. దీంతో రెచ్చిపోయిన వాహనదారుడు పెట్రోల్ పోసిన వ్యక్తిపై విచాక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలతో పెట్రోల్ బంక్ నిర్వాహకుడు కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.