Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ అధికారులు నిన్న మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో స్పందించిన బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. తనకు సిట్‌పై నమ్మకం లేదని అన్నారు. పార్లమెంట్ సమావేశాల తరుణంలో బిజీగా ఉన్నానని, ఇదే విషయాన్ని ఇప్పటికే తెలిపానని, అయినా మళ్ళీ నోటీసులు ఇచ్చారన్నారు.
స్కాంను తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం మొదటి నుంచి జరుగుతోంది. రాజకీయాలను పక్కన పెట్టి మీ ఆత్మ సాక్షితో ఆలోచించండి. ఈ స్కాంతో ఎన్నో లక్షల మంది మనో వేదనకు గురవుతున్నారన్నారు. అసలు విషయంపై విచారణ జరపకుండా తనకు నోటీస్‌లు ఇవ్వడానికే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల క్రమంలో తాను హాజరు కావడం లేదని మరోసారి స్పష్టం చేశారు. కాగా బండి సంజయ్‌కు బదులుగా ఆదివారం హిమాయత్ నగర్ సీట్ ఆఫీస్‌కు ఆయన లీగల్ టీమ్ చేరుకుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.