Anji-Khad Bridge!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 30, 2023
First cable-stayed bridge (193 m height) of Indian Railways. pic.twitter.com/hwcnl5lrq8
Authorization
Anji-Khad Bridge!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 30, 2023
First cable-stayed bridge (193 m height) of Indian Railways. pic.twitter.com/hwcnl5lrq8
నవతెలంగాణ - హైదరాబాద్
మన దేశ నిర్మాణ రంగంలో మరో అద్భుతం వచ్చి చేరనుంది. జమ్మూ అండ్ కశ్మీర్ ప్రాంతంలోని కాట్రా, బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. పనులు తుది దశకు చేరుకున్నాయి. చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు చాలా విశిష్టతలు ఉన్నాయి. గంటకు 213 మైళ్ల వేగంతో వీచే గాలులను నిరోధించి తట్టుకోగల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఈ తీగల రైలు వంతెనపై100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించొచ్చు. గాలుల వేగం 90 కిలోమీటర్లు దాటిన సందర్భాల్లో రైళ్లను నిలిపివేస్తారు. కేబుల్ ఆధారిత వంతెన మధ్య భాగం నది ఉపరితలం నుంచి 331 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే కశ్మీర్ వ్యాలీ మొత్తం రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం అవుతుంది. వంతెన పొడవు 725.5 మీటర్లు. 2003లో అనుమతులు రాగా, 2004లో నిర్మాణం ప్రారంభమైంది. మొత్తాన్ని దీని నిర్మాణాన్ని ముగింపుదశకు తీసుకొచ్చారు.
ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జి ఇదేనట. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన పొడవు 35 మీటర్లు అధికం. పర్వత ప్రాంతాల నడుమ ఎత్తయిన ప్రదేశంలో ఇది ఉంది. పనులు తుది దశకు చేరుకోగా, మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. 47 సెగ్మెంట్లకుగాను 41 పూర్తియినట్టు, మిగిలినవి ఏప్రిల్ చివరికి లేదంటే మే నెల మొదట్లో పూర్తవుతందని ఓ అధికారి తెలిపారు.