Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉత్తరఖండ్
ఉత్తరకాశీలో విషాదం చోటుచేసుకున్నది. ఉత్తరకాశీ సమీపంలోని ఖట్టూ ఖాల్ అటవీ ప్రాంతంలో మేకల మందపై పిడుగు పడింది. దీంతో మందలోని 350కి పైగా మేకలు, గొర్రెలు మృతిచెందాయి.
బర్సూ గ్రామానికి చెందిన సంజీవ్ రావత్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి రిశీకేష్ నుంచి ఉత్తరకాశీకి మేకల మందను తీసుకొస్తున్నాడు. ఈ తరుణంలో శనివారం రాత్రి ఉత్తరకాశీకి సమీపంలోని ఖట్టూ ఖాల్ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే భారీ వర్షం కురుస్తున్నప్పటికీ మేకలను తరలిస్తున్నాడు. అదేసమయంలో సమీపంలోని ఎత్తయిన పైన్ చెట్టుపై శక్తివంతమైన పిడుగుపడింది. దీంతో పిడుగుపాటుకు మందలో ఉన్న 350కిపైగా మేకలు, గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నష్టాన్ని అంచనావేసి జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తారని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు తెలిపారు.