Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సత్యాగ్రహం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన సత్యాగ్రహంలో కాంగ్రెస్ నేత, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ తరుణంలో నరేంద్ర మోడీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఏం నేరం చేశారని ఆమె కేంద్రాన్ని నిలదీశారు. సత్యాగ్రహంలో ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ వంటి సీనియర్ నేతలు పాల్గొన్నారు.