Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కాంగ్రెస్ సీనియర్ నేత డీ.శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ తరుణంలో వీల్‌చైర్‌లో గాంధీభవన్‌కు వచ్చిన డీఎస్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో తిరిగి చేరుతుండటం ఎంతో ఆనందంగా ఉందని, సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని అన్నారు. తన పెద్దకొడుకు ధర్మపురి సంజయ్‌తో కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే మరో నేత మేడ్చల్ సత్యనారాయణ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డీఎస్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో డీఎస్‌కు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి, ఇతర ముఖ్య నేతలు పార్టీలోకి ఆహ్వానించారు.