Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఓ యువ నటి సూసైడ్ చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడింది. వారణాసిలోని ఓ హోటల్లో ఆమె విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనతో భోజ్‌పురి చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. ప్రస్తుతం నటి వయస్సు 25 సంవత్సరాలు.
ఆత్మహత్యకు కొన్ని గంటలముందే పవన్ సింగ్‌తో కలిసి ఆమె చేసిన మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆకాంక్ష ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ రీల్స్ చేస్తూ అభిమానులతో పంచుకునేవారు. ఆకాంక్ష దూబే 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో జన్మించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆకాంక్ష ఇన్‌స్టాగ్రామ్‌లో రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించింది. తన సహనటుడు సమర్ సింగ్‌తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. అయితే ఆకాంక్ష 2018లో డిప్రెషన్‌తో బాధపడి.. కొన్ని రోజులు సినిమాల నుంచి విరామం తీసుకుంది. ఆ తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆమె 17 ఏళ్ల వయసులోనే మేరీ జంగ్ మేరా ఫైస్లా అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆకాంక్ష ముజ్సే షాదీ కరోగి (భోజ్‌పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్, కసమ్ పైడా కర్నే కేఐ 2 ప్రాజెక్ట్‌లలో కూడా కనిపించింది.