Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి మరో పతకం సాధించారు. సూపర్ ఫామ్లో ఉన్న ఈ ఇద్దరు స్విస్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన రెన్ గ్జియాంగ్ యూ, టన్ క్వియాంగ్ ద్వయంపై గెలుపొందారు. నువ్వా నేనా అన్నట్టుగా 54 నిమిషాలు సాగిన టైటిల్ పోరులో 21-19, 24-22తో విజయం సాధిందారు. దాంతో, ఈ ఏడాది తొలి టైటిల్ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటివరకు సాత్విక్ – చిరాగ్ జంటగా ఆడి ఐదు వరల్డ్ టూర్ టైటిళ్లను గెలిచారు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో రెండో సీడ్ అయిన సాత్విక్ – చిరాగ్ మలేషియా జోడీని చిత్తు చేశారు. ఒంగ్ యవ్సిన్, టియో ఎఈపై 21-19 17-21 21-17తో అనూహ్యంగా విజయం సాధించారు. ఫైనల్ చేరి పతకంపై ఆశలు రేపారు. భారత స్టార్లు పీవీ.సింధు, హెచ్ ఎస్. ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. గత ఏడాది మహిళల సింగిల్స్ విజేత సింధు ఈసారి నిరాశ పరిచింది. దాంతో, సాత్విక్ – చిరాగ్ జోడీపైన అందరూ ఆశలు పెట్టకున్నారు. అభిమానులు, కోచ్లు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ఇద్దరు నిలబెట్టారు. డబుల్స్ టైటిల్ గెలిచి మరోసారి తమ సత్తా చాటారు.