Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు తెలుగుదేశం పార్టీ సన్నద్ధమవుతుంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో నేడు పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో సమావేశం నిర్వహించారు.
ప్రజానాయకుడు, తెలుగువారి ఆరాధ్యుడు అయిన ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో తరతరాలకు ఆయన గుర్తుండిపోయేలా 'జయహో ఎన్టీఆర్' అన్న వెబ్ సైట్, 'శకపురుషుడు' అనే ప్రత్యేక సంచికతో పాటు ఎన్టీఆర్ శాసనసభలో చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలతో రెండు పుస్తకాలను తీసుకొస్తున్నామని చంద్రబాబుకు జనార్దన్ వివరించారు.
రెండు పుస్తకాలను విజయవాడలో ఆవిష్కరిస్తామని, వెబ్ సైట్ మరియు శకపురుషుడు సంచికను హైదరాబాదులో ఏర్పాటు చేసే కార్యక్రమంలో విడుదల చేస్తామని చెప్పారు. ఈ రెండింటికీ సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబుకు వివరించారు. గత ఐదు నెలలుగా ఎన్టీఆర్. శతజయంతి కమిటీ శ్రమిస్తోందని, సినిమా రంగంలోని ప్రముఖులు మరియు రాజకీయరంగంలోని నిష్ణాతుల అభిప్రాయాలను వీడియో/వ్యాస రూపంలో తీసుకోవటం జరిగిందని ఎన్టీఆర్ ఖ్యాతి తరతరాలు నిలిచిపోయేలా వీటిని రూపకల్పన చేస్తున్నామని జనార్దన్ పేర్కొన్నారు.