Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్ : దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ రెండో విడత అడ్మిట్ కార్డులు త్వరలో విడుదల కానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టి) ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 6 నుంచి 12 తేదీల మధ్య జరిగే జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలకు విద్యార్థులు ఫిబ్రవరి 8 నుంచి మార్చి 12 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్న విషయం తెలిసిందే. అడ్మిట్ కార్డులతో పాటు పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం తమ అధికారిక వెబ్సైట్లు లలో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.