Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూఢిల్లీ
లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడడంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం నాడు తన ట్విట్టర్ బయోను మార్చివేశారు. తనను తాను ‘డిస్ క్వాలిఫైడ్ ఎంపి’గా అందులో పేర్కొన్నారు. అంతకు ముందు ‘మెంబర్ ఆఫ్ పార్లమెంటు’ అని ఉన్న చోట ‘డిస్ ’క్వాలిఫైడ్ ఎంపి అని అప్డేట్ చేశారు. ప్రధాని మోడీపై విమర్శలు చేసే క్రమంలో రాహుల్ గాంధీ ఓ వర్గాన్ని కించపరిచారంటూ దాఖలైన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే.అయితే ఆమరునాడే లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌ను ఎంపిగా అనర్హుడిగా ప్రకటిస్తూ వేటు వేయడం గమనార్హం.