Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురస్కారం అందజేసిన మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ-బెజ్జంకి
ఉత్తమ జిల్లా స్థాయి ఆరోగ్య గ్రామ పంచాయతీగా మండల పరిధిలోని 'రేగులపల్లి'గ్రామం ఎంపికైంది. అదివారం జిల్లా కేంద్రంలోని విపంచి కన్వేషన్ హాల్ యందు "దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ " సతత్ వికాస్ జిల్లా స్థాయి పురస్కారాన్ని మంత్రి తన్నీర్ హరీశ్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ,అటవీశాఖ చైర్మన్ ప్రతాప్ రెడ్డి కలిసి రేగులపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు జిల్లాస్థాయి ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ పురస్కారం ప్రధానం చేశారు. గర్భీణుల సంరక్షణ, పోషకాహార పంపిణీ, కొవిడ్ వ్యాక్సినేషన్, టీబీ నిర్మూలన, తడిపోడి చెత్త సేకరణ, పరిశుభ్రమైన పరిసరాలు వంటి అంశాలు పూర్తిగా స్థాయిలో అమలుచేయడం వల్ల జిల్లా స్థాయి ఉత్తమ ఆరోగ్య గ్రామ పంచాయతీ పురస్కారానికి ఎంపికైందని ఎంపీడీఓ రాము తెలిపారు.ఉత్తమ పురస్కారం అందుకోవడం చాల అనందనీయమని సహరించిన ప్రజాప్రతినిధులు,అధికారులు,గ్రామ ప్రజలకు సర్నంచ్ జెల్లా ఐలయ్య కృతజ్ఞతలు తెలిపారు.ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కనగండ్ల కవిత,ఎంపీటీసీ రాజ మహేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ ,వార్డ్ సభ్యులు తదితరులు హజరయ్యారు.