Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్-16 సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభంకానుంది. గతేడాది పేలవ ఆటతీరుతో పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సారి టోర్నీ ఆరంభం కాకముందే షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. వెన్ను గాయం కారణంగా ఇప్పటికే న్యూజిలాండ్ పేసర్ కైల్ జెమీసన్ సేవలను కోల్పోయిన సీఎస్కేకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
గతేడాది అదరగొట్టిన ఫాస్ట్‌బౌలర్ ముఖేశ్ చౌదరి కూడా ఐపీఎల్-16కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెన్ను గాయంతో బాధపడుతున్న అతడు.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ముఖేశ్ చౌదరి గాయం నుంచి ఎప్పటివరకు పూర్తిస్థాయిలో కోలుకుంటాడనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభంకానుంది.