Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - టునీషియా
ఘోర పడవ ప్రమాదం. ఓ బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి 29 మంది వలసదారులు మరణించారు. ఈ తరుణంలోనే మరో 67 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 19 మృతదేహాలను స్వాధీనం చేసినట్లు షనల్ గార్డ్ ప్రతినిధి హౌసమెద్దీన్ జెబాబ్లీ తెలిపారు. దీనిలో ఇప్పటివరకూ 11 మందిని రక్షించినట్లు వారు తెలిపారు. మునిగిపోయిన పడవల్లో ఇంకా ఎంత మంది ఉన్నారనే విషయం తెలియరాలేదు. అయితే వీరంతా ఆఫ్రికాకు చెందిన వారిగా అధికారులు భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం మధ్యధరా సముద్రం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గం అని తెలిపింది.