Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది కోర్టు.
సీబీఐ తరపున దర్యాప్తు అధికారిని మార్చాలంటూ పిటిషన్ వేశారు తులసమ్మ. గతంలో ఈ పిటిషన్‌పై విచారణ తరుణంలో సుప్రీం కోర్టు దర్యాప్తు సంస్థ తీరును తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది.