Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుంటూరు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఎవరికి ఓట్లు వేశారో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏవిధంగా చెబుతారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. గుంటూరులో మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలకు ఆత్మీయ విందు ఆదివారం జరిగింది.
ఈ తరుణంలో నక్కల ఆనందబాబు విలేకర్లతో మాట్లాడుతూ. ‘మా వద్ద ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్లు మాకు ఓటింగ్ చేయలేదు. కొందరు క్రాస్ ఓటింగ్ చేశారు. మేము ఇచ్చిన కోడింగ్ అనుసరించలేదు. అని సజ్జల చెప్పడం ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నేరం. సీక్రెట్ ఓటింగ్, సీక్రెట్ బ్యాలెట్ జరిగినప్పుడు వారు ఎవరికి ఓట్లు వేశారో దొంగతనంగా ఎలా చూశారు? అదీ మీడియా ముందు సజ్జల ఎలా చెప్పారు. దీని ప్రకారం రామకృష్ణారెడ్డిని ప్రాసిక్యూట్ చేయాలి. ఆయనపై చర్యలు తీసుకోవాలి అని ఆనందబాబు డిమాండ్ చేశారు. దళిత మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి భయపడిపోతున్నారు. సజ్జల వల్ల హాని ఉందని ఆమె వాపోతున్నారు. ఎమ్మెల్యేలపై సమన్వయకర్తలు, ఇన్ఛార్జులను పెట్టి అవమానించారు. బెదిరించారన్నారు.