Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగురాష్ట్రాల మధ్య మరో వందేభారత్ రైలు పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్–తిరుపతి మధ్య వందేభారత్ రైలు నడపాలని కేంద్ర రైల్వేశాఖ నిర్ణయించింది. ఏప్రిల్ 8 నుంచి ఈ రైలును ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారమిచ్చింది. ఈ క్రమంలో దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్, తిరుపతి మధ్య నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ప్రయాణించే రూట్లోనే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. రెండు తెలుగురాష్ట్రాల మధ్య మూడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ గతంలోనే నిర్ణయించింది. ఆ తరుణంలోనే మరో రైలుకు స్వీకారం చుట్టనున్నారు.