Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉచిత వైఫై ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ తొలిసారి ప్రారంభించింది. 16 ఏసీ స్లీపర్ బస్సులకు హైటెక్ హంగులు జోడించింది. ప్రయాణికులకు ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందించింది. ఈ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హైదరాబాద్ ఎల్బీనగర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల ప్రారంభించిన 12 నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే వీటికీ ‘లహరి- అమ్మఒడి అనుభూతి’గా సంస్థ నామకరణం చేసింది. ప్రయాణికులకు నేటి నుంచే ఇవి అందుబాటులోకి వచ్చాయి. విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హుబ్బళ్లి మార్గాల్లో వీటిని నడపనున్నట్లు సంస్థ తెలిపింది.